ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


టెందైనఁగలదా? ఈర్ష్యావేశుఁడవై యేల యీలీలనకార్యములఁ గావింప నొడిగట్టెదవు ? ఋషిజన సేవ్యమానమై యలరారు మనపుణ్యదేశమును గిరాతుల పాల నేల పడవైచెదవు. పతివ్రతాతిలకములని ప్రసిద్ధివడయుచు నుత్తమ విద్యావంతురాండ్రై స్వచ్చంధ సంచారంబుల జీవనములఁ గడుపు నీ సోదరీమతల్లుల కందఱకు మానభంగమగురీతి నేలసల్పెదవు? సొందర్యవంతుల కెల్ల బందీగృహవాసము ప్రాప్తమగుభంగి నేల కలుగజేసెదవు. తండ్రీ! నీవుపూనియున్న యసూయను ద్యజించినచో నింతదారుణములు గలుగ నేరవుగదా? పక్షపాతర హితుఁడవై మంచిచెడ్డల నాలోచించి చూచుకొనుము. ప్రస్తుతము నీ సహాయ మవసరమగుటచే వీరందఱు గ్రుక్కిన పేలవలె యూరుకుండియున్నారు. కాని లేకున్న బట్టబగ్గము లుండెడివా? ఈదుష్టులొనరించు బీభత్సముల వినియు, గనియు నిట్లేల యజ్ఞానంబున మునిఁగెదవు ? మఱియు నిత్తరి మనదేశంబున జరుగుచున్న సంఘసంస్కారములన్నియు నీ క్రూరుల మూలమునేకదా? నాయనా! నీ సోదరీ జనంబులకుఁగల స్వాతంత్ర్యము లన్నియు నడఁగి దాసీలకన్న నీచమగుబ్రతుకు చేకూరుపనులఁ జేయబూనుట నికనైన మానుము. ఇంతకు మునిపేమియోకాని యిప్పుడు నిన్ను నిందింపనివాఁడు మందునకైనఁ గానరాఁడు. జయచంద్రా! నీ మూలమునఁగదా నేఁటికి మా కిట్టియిక్కట్టులు సంప్రాప్తము లైనవని రోదనము లొనర్చుచు నెందరో పుణ్యాంగనలు తమ ప్రాణముల గోల్పోవుచున్నారట. వెండియు మనదేశమున

208