ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది తొమ్మిదవ ప్రకరణము


నా పైఁగల మక్కువను సహితము వదలితివ ? కట్టా ! కన్న కూతుల నిట్లుగారియలంబెట్టు తండ్రులెందైనఁ గలరా ? ఇదివరకు మహ్మద్ గజినీ దాడివెడలివచ్చి మనదేశమున నెట్లునాశనఁ జేసిపోయినది నీ వెఱుఁగవా? అయ్యో ! బిడ్డలవంటి నీ ప్రజలనందర మ్లేచ్చుల కేలసమర్పించెదవు. గోహంతకులగు నీ క్రూరులఁ జేరఁదీసి నా ప్రాణకాంతునిపై నేల కత్తిగట్ట నెంచెదవు . వీరి నమ్ముకొనిన నీ కావంతయు లాభములేదు. నాప్రార్దన మాలకించి యిప్పుడైన నీ సేనల మరలించుకొని వెడలిపొమ్ము. నన్ను గటాక్షింపుమ"ని కడుదీనముగా వేడుకొనుచున్న పుత్రికను గన్నులెఱ్ఱచేసి చూచుచు "ఓసీ ! దుర్మార్గురాలా ! హీనాభి సారిక భంగి నా యిష్టము లేనియెవనినో చేపట్టి సిగ్గులేక తగునని నాకు బుద్ధులుగఱప నేతెంచితివా? చాలు. నా యెదుటనుండి వెడలి " పొమ్మని కసరుకొన మరల నామె వినయపూర్వకముగ " నాయనా! నాపై నింతకోపమేటికి ? హీనాభిసారికవలె నే నేనీచునైన వరించితినా ? ఆర్యావర్తమున కంతయు సార్వభౌముఁడై దీనదయా పరుఁడై, ధీశాలియై మన్ననలకెక్కిన మూర్ధన్యశిరోరత్నమగు బృథివీరాజుంగదా నే వరించి పరిణయమైనది. అయ్యో : చక్రవర్తి యతటివాఁ డల్లుఁడయ్యెనని సంతసించుటకు మారుగ నతనికిఁ గీడుగావింపఁదలఁచు టెంత వెఱ్ఱిదనము. చక్రవర్తి జామాతయయ్యెననిన నీకుఁ గలుగు ప్రఖ్యాతికి మేర కలదా ? తండ్రీ ! మనమందరము గలసి ప్రసన్న హృదయులమై యొకచోట నివాసముఁజేయుట మాని యిట్లు పోరాడుకొనుచుండు

207