ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదితొమ్మిదవ ప్రకరణము

యచంద్రుఁ డట్లు చక్రవర్తిపురముల మూఁడింటి ముట్టడింప సేనలనంపి వారుపోయిన మూడవనాటి ప్రాతఃకాలమున దానున్న శిబిరమువిడచి యొంటరిగఁ గాళీనదిలోనికేగి యందొకవైపునఁ జల్లగనున్న స్వచ్ఛసికతా తలమున నాసీనుఁడై నెమ్మదిగఁ బారుచున్న నదిని నవలోకించుచు, తాను గావింపుచున్న కార్యములన్నియుఁ దలఁపునకు రా నేమేమో యాలోచించు కొనుచుండెను. అట్టితరుణమున నాకస్మికముగ సంయుక్తయే తెంచి నమస్కరింప నతఁడు విభ్రాంతుఁడై చూచుచు నేమియుఁ బల్కరింప కూరకుండెను. అప్పుడు సంయుక్త మెల్లన "తండ్రీ! నీ పరిపారమును విడచివచ్చి యొంటరిగ నీ విట నేమి యాలోచించుచున్నావు. నీ మాతృభూమి యగు నార్యావర్తముపై గల నభిమానము నంతయుఁ ద్యజించితివా? కడుగారాబమునఁ బెంచిన

206