ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


యతని లోనికిఁ గొనిపోయిరి. చక్రవర్తి లోపలికేగినపిదస మంజరి క్షేమసమాచారమడిగి కొంతతడవునకు "మంజరీ : నీనెచ్చలి నాతోఁ గూడ సంగరమునకు వచ్చెదనని యడుగుచున్నది. మేమిటలేనితరి పురమును రక్షించుభారము నీదే" యన సంయుక్తచే నదివరకే యొప్పింపఁబడియున్నది గావున నట్లేయని యామె సమ్మతించెను. అనంతర మెల్లరు మరల వేగులవారేమి వర్తమానము గొనివత్తురోయని కాచుకొని యుండిరి. కొన్ని దినములు కడచినవెన్క నిట నలీఘరువద్దనున్న జయచంద్రు సుల్తానుగారు సేనాసమేతముగఁ జనుదెంచి కలసికొనిరి. నాటినుండియు మహ్మదీయులు, నార్యులు ననుభేదము లేకుండ నుండవలయునని యొప్పందము చేసికొనిరి. అటుపిమ్మట సుల్తాన్ జయచంద్రు లిరువురుగలసి తమసేనలగొన్ని భాగములుగ విభజించి కోసలాధిపుని యాధిపత్యమున నొకభాగమును చోలాపురి ముట్టడించుటకును, వంగదేశపతి నాయకత్వమున నింకొక భాగమును ఫరుక్నగరమును స్వాధీనము చేసుకొనుటకును, బురిహరరాజు కులుని వశమున మరియొకభాగమును గైజియా పట్టణము నాక్రమించుకొనుటకును బంపిరి. చారు లరుదెంచి బయటజరుగుచున్న వార్తల నిటఁ . జక్రవర్తి కెఱుక బఱుపగా నతఁడు సప్పుడే యక్షౌహిణీపతులు మొదలగువారి రావించి ఘూర్జనపతిని గోసలు నెదురించుటకు, రాజపుత్రస్థానమునుండి వచ్చినవారిలో నచల మహాబుద్ధులను నిరువుర మందూరు వందంపతుల నెదురించుటకును దగినసేనలనిచ్చి పంపి యాఫ్‌గన్ స్థానమునుండి మరల

204