ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియెనిమిదవ ప్రకరణము


మొదలగు పీనుగుల దినుపక్షులు బలహీనములై వ్రేలాడుచున్న నా నరముల పీకుకోని తినుటకై తటతట రెక్కలల్లార్చుకొనుచు నాపైవ్రాలవచ్చుచుండెను. అట్టియెడ నే నేమనివచింపుదు, పాప మీచిన్నవాని జనకుఁడు నాకు గొంచెము దూరములోఁ బడియుండి మోకాళ్లవరకు నఱుక బడియుండుటచేఁ బొరలి యాడుచునైన నాదగ్గరకు రాలేకసగము తునిగిన మొండికత్తితో దనశరీరమందలి మాంసపు గండలఁ బెఱికి నాపై వ్రాలవచ్చు పక్షులకు వైచుచు నన్నంటకుండఁ జేసి తనఋణము దీర్చుకున్నాడు. తరువాత నాకు మరల స్మృతితప్పిపోయినది. అంత నేమిజరిగినదియు నాకుఁ దెలియదు. తిరుగనాకుం దెలివివచ్చునప్పటికి నా సేనాధిపతుల నడుమనుంటిని. అతనికొఱుకు వెదకించితిగాని యెచటను గాన్పింపలేదు. బుద్ధిహీనులారా! అట్టియుత్తమసాహసికు నా రణమందు లేడని మీరు వచించుట ? అట్టిపరాక్రమశాలి ధవళకీర్తికా మీరుకళంకము గల్పించుట? ఇఁక ముందెన్నటికి నిట్టిదుడుకు తనపు మాటలాడక గారవమున నతనిస్మరించుచుండుడు. సమ్యమ రాయుఁ డెప్పుడును వెన్నిచ్చి పారువాడుకాడు. రణమున బృధివీరాజునకతఁడు సోదరుఁడై మెలఁగినాడు." అని యాకుఱ్ఱవాని వంకకుఁ దిరిగి బుజ్జగింపువాక్యములతో "నాయనా ! నీవింకను పసిపాపపు. రణమున కేతెంచుట యుక్తముకాదు. సద్విద్యలం దారితేరి నీ జనకునిబలె శాశ్వతకీ ర్తినంద బ్రయత్నింపు" మని అతని బంపి వేసి తాను రాణివాసమున కఱిగెను. అంతఃపురద్వారముల సమీపించిన వెంటనే మంజరీసంయుక్త లేతెంచి ప్రణమిల్లి

203