ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియెనిమిదవ ప్రకరణము


కేతెంచి యిట్లు విన్నవించుకొనిరి. “రాజేంద్రా ! మనదేశముపై మహమ్మదీయులు దండెత్తి వచ్చుటయు, జయచంద్రుఁడు మొదలగు వారు వారికిఁ దోడ్పడుటయు నాదిగాఁగల సకల వృత్తాంతముల నెఱిగియేయున్నాము. తనకు సహాయముగ రమ్మని జయచంద్రుడు మాకును లేఖలనంపినాడు. మే మతనికి సహాయముగ బోవుట కిచ్చగింపక యేలినవారి సామంతుల మగుటచే రణసమయమున మీకు మే మొనరింపఁదగు దాని సలుపుటకై సర్వసిద్ధులమై వచ్చితిమి. మీ యాజ్ఞానుసార మెట్లు నడచుకొమ్మనిన నట్లు వర్తించెదము. యుద్ధమున మీ కొరకై మా ప్రాణముల సహిత మర్పింప సన్నద్ధులమై యున్నా" మని పలుక జక్రవర్తి మితిమీరిన సంతసమున "ఆహా! నేటికి నేను నిక్కముగ ధన్యుడనైతి. మన యార్యావర్తమునంగల నృపులెల్లరు మాతృద్రోహులును, స్వామి ద్రోహులును, స్వార్ధ పరాయణులు నని తలచియుంటిగాని నేడా తలంపు మారిపోయినది. మనకు జయముకాకున్న బోనిండు. మన యార్యావర్తము నందు మిమ్ముఁబోలు పరోపకార పారీణులు గొందరున్నారుకదా యని సంతోషము కలుగుచున్నది,” అని వారందఱకుఁ బస దనంబు లొసంగి వారు వెంటఁగొని వచ్చిన సేనల దన యక్షౌహిణీ సేనలఁ జేర్పించెను. ఆ సమయమందే లోకులందరు సౌందర్యమునకు మెచ్చి పెట్టిన యలంకారుఁడను పేరుగల బాలుడొకడు రోషావేశమున నెఱ్ఱాబారిన ముఖముతో సభామధ్యమున కేతెంచి చక్రవర్తితో "మహారాజా ! ముందు శత్రువు

201