ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


గారా ఖండితంపు వాక్యములకు సంతుష్టులైరి. దేవశర్మ రాజు దిక్కు మొగంబై " జయచంద్రా ! నీ వింతటి యవివేకుండ వేటికైతివో తెలియఁజాలకున్నాను. ఇంచుకైన యుక్తాయుక్త విచార మొనరింపవా? అయ్యో " యని యింకను నేమియో వచింపబోవుచుండ నతడు విసువుకొనుచు “అయ్యా ! ఈ నీతి వాక్యముల వినివిని నా చెవులు తడకలు కట్టిపోయినవి. మరల మీకీ శ్రమయెందుకు ? క్షమింపుడు. ఇత్తరుణమున మాత్రము తమ వాక్యముల మన్నింపనోప " నని మొగమోట మించుకైన లేక నిష్ఠురముగఁ బలుక దేవశర్మ మనస్సు కలుక్కుమన వేరొండు వచింపనోడి "యటులనా " యని కొలువు వెడలి పోయేను. నిజపురోహితుఁ డట్లుకోపమున బోవుచుండ జూచుచు నూరకుండెనేకానీ జయచంద్రుఁ దావంతయు లెక్కఁగొనఁ డయ్యెను. ఈర్ష్యాగ్రస్తులకు మర్యాదామర్యాద వివేచన జ్ఞానము సహితము నుండదు కాబోలు. ముఱునా డతడు సకల సేనా సమన్వితుడై సామంతులం గూడుకొని యలీఘరు ప్రాంతమున కేగి కాళీనది యొడ్డున ధండును విడియించి డేరాలవేయించి సుల్తాన్‌గారి రాకకై యెదురు చూచుచుండెను. అట ఢిల్లీనగరమున వేగులవారివలన బయట జరుగుచున్న సంగతులను విని చక్రవర్తి పట్టరాని యాగ్రహమూని యొక సభజేసి యందు దండనాయకులు మొదలగు వారలకు యుద్ధసంబంధములగు విషయములఁ కొన్ని వక్కాణించు చుండెను. అత్తరి రాజపుత్ర స్థానమందలి కొందఱు సామంతులును, ఘూర్జరదేశాధీశుడును జక్రవర్తికడ

200