ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియెనిమిదవ ప్రకరణము


వినయశీలుఁడు దనపనికి రాజీనామా యొసంగి చనినపిదప నతని స్థానమున భట్టుగారే యుంచబడిరి గావున రాజుగారికి మంత్రాలోచనములన్నియు నితఁడే బోధించుచుండెను. జయచంద్రునకుఁ దోడ్పడఁ జనుదెంచినరాజులకుఁ జక్రవర్తిపై లేనిపోని దోసములఁ గల్పించిచెప్పి యసూయ బుట్టించుచుండెను. సమస్త సామంతులు వచ్చినపిదప గుతుబుద్దీన్ వద్దనుండి సమాచార మెప్పుడేతెంచునా యని భట్టుగా రెదురుచూచుచుండిరి. అంతలో గొందఱు మ్లేచ్చభటు లేతెంచి గుతుబుద్దీ నొసంగినలేఖల భట్టుగారి కియ్య నవిచూచుకొని పరమానందమునొంది వాటినన్నింటి జయచంద్రునకుఁ జూపింప సతఁడును మోదమగ్నుడై యలీఘరువద్దకు తమ్ముగలుసుకొన వలసినదిగా మ్లేచ్చులకు వర్తమానమంపెను. ఆ మరుసటిదినమునవచ్చిన రాజమండలిగూడు కొని యలీఘరునకుఁబోవు ప్రయాణమును గూర్చి ముచ్చటించు కొనుచుండ దేవశర్మయేతెంచి నృపునిచే మన్ననలంది యొక పీఠమున నాసీనుడై మెల్లన నిట్లనియె. జయచంద్రా ! ఈ సంరంభ మంతయు నేటికి?

జయ! అయ్యా! మీకన్నియు దెలిసియే యుండును. తెలిసి యుండియు నిట్లేల యడిగెదరు. చక్రవర్తిపై దండెత్తం బోవుచున్నాము.

అని నృపుఁడు పలుక దేవశర్మ యెక్కడ వచ్చెనాయని విసువుకొనుచు మొగముమాడ్చుకొని కూరుచుండియున్న భట్టు

199