ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము


యభిషేకార్ఘ్యపాద్య నైవేద్యాది క్రియలఁ గ్రమముగ నొనర్చుచునే యుండెను. మఱియు గుడ్లగూబలు మొదలగుఁ బక్షులును దమశక్త్యానుసారముగ నుడుతబత్తిఁ జేయుచుండెను, గాలి గోపురము సగముకూలి దివాంధములకును గొండచిలువకును నావాసమై వాటియారావములతో నిండియుండెను. ప్రాకారపు గోడలన్నియు నెక్కడివక్కడ కూలి నేలతోఁ జదరమగు చుండెను. గుడివెలుపటి భాగమున ననగా బ్రాకారపు లోపలి భాగమున నున్న గుళ్ళన్నియుఁ బసులకాపరుల జంతువులు వైచిన పెంటలతో రోతగలుగఁజేయుచుండెను. కొండంతయు నిట్లు పాడుపడి ఉన్నను మధ్యనున్న కాళికాలయము మాత్రము శక్తిపూజాధురంధరులగు వామమార్గ మతస్థులవలన జాగరూకత తోడఁ గాపాడఁబడుచుండెను. గజినీచే మొండిగఁ జేయఁబడిన దేవీవిగ్రహమునకు వెండికన్నులు మొదలగునవి యలంకరించి శిధిలములైన గోడల బాగుపఱచుకొని ద్వారమొకదాని నేర్పఱచుకొని యందుపూజలు యధావిధిగఁ జేసికొనుచుండిరి. మఱియుఁగొండపైనున్న సగము పడిపోయిన గదులకుఁ బాషండులగు బైరాగులు కొందరప్పుడప్పుడు దర్శన మిచ్చుచుందురు. కొండదరికేగిన గంజాయి యొక్కయుఁ గబ్బిలపుఁ బెంటల యొక్కయు మురికికంపుతక్క వేరొండు శుభ్రమగు వాయువు లేని కారణమున సజ్జనులగు వారలచటి కేగుట మానివేసిరి. అట్టి యా పాడుపడిన మెట్లమీఁదుగ నొకనాఁటి సాయంకాల మాఱు ఘంటలవేళ బాటసారి యొకఁడు కొండపైకేగి యచటి స్థల

21