ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియెనిమిదవ ప్రకరణము

అఁట జయచంద్రు డంపిన లేఖలఁ జూచుకొని యార్యా వర్తమునం గల కొద్దిమంది సామంతులు దప్ప దక్కినవారందఱు స్వార్ధపరత్వమూని స్వతంత్ర రాజ్యములు లభించునను కోరిక దమతమ నేనల వెంటగొని కన్యాకుబ్జము జేరవచ్చిరి. అందు జయచంద్రుని ప్రాణ స్నేహితుడును మందూరు పాలకుడును నగు పురిహరరాజకులుండు నలుబదివేల సైన్యము తోడను, నేపాల కోసల వంగదేశాధిపతులు తొంబది వేల నేనలతోడను, కాశ్మీరపతి ముప్పదివేల బలములతోడను, మగద నాథుఁడు నలుబదివేల సైన్యములతోడను జనుదెంచెరి, వీరందఱి రాకకు జయచంద్రుఁడు సంతసమందుచు నందఱననేకగతుల మర్యాదలొనర్చి మన్నించుచుండెను. ఇంక నీశ్వరభట్టుగారి సంతోషమునకు పరిమితియేలేదు. రాజ్యకార్యదురంధరుండగు

198