ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


జింత బెట్టుకొనకుడు. మీదేశక్షేమమునకై నా పైగల మోహముం ద్యజించి సంగరమున కరుగుడు. తమ సెలవైనచో నాతండ్రి యని శకింపక నేనుసు దమకు సాయముగ జనుదెంచెదను. సంభవించిన మనకిరువురకు రణముననే మరణము సంభవింపనిండు . అందులకు నా కావంతయైన విచారముకాని భీతికాని లేదు" అని ధీరత్వముతోపఁ బల్కిన తన పియాంగన వాక్యము లాలకించి చక్రవర్తి సంతోష పరవశుడై యామె నాలింగన మొనరించుకొని “ సతీ నీ వంటి యుత్తమ సాధ్విం జేపట్టిన నాకే కొఱంతయైన గలుగునా ? నా పురాకృత పుణ్యవశంబున నీవు సాకు లభించితివి కాని వేరొండుకాదు. పురుషుని మదికి జింత కలిగినతరి సమయోచితంబు లగు మృధుమధుర వాక్యములచే నతని దేర్చునదియే యతని బాలిటి భాగ్య దేవత యనం జెల్లు గాని లేకున్న మృత్యు దేవతయే యగుగదా. నీ వియ్యెడ వచించిన బల్కు లెంతయు నాదరణీయములు, చెలీ : నీ రణకౌశలము నే నిదివర కనేక పర్యాయములు గాంచియే యున్నాను . ఘోరసంగ్రామమున నా తలఁ దెగవ్రేయ నున్న కహరకంఠీరవు నొక్కవ్రేటున దునిమి నన్ను గాపాడిన దానికంటె వేరుగ జూడవలయునా ! నీ వీభూచక్రము నంతయు బాలింప దగియున్నా వనుట కెంతమాత్రము సందియము లేదు. అయినను యుద్ధమునకుఁ గొనిపోపు తలపున మన నగరమందలి యౌవన వతులందరకు రణశిక్ష నేర్పించి యుంచినాను, వారంద రిపుడు నాతో రా సిద్ధముగ నున్నారు. మే మందఱము రణస్థలి కేగ

196