ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియేడవ ప్రకరణము


వలనుకాదని తిరస్కరించుచు యుద్ధమునకు బ్రయత్నములఁ జేయించుచుండెను. రాయబారి యిదంతయు గ్రహించి తత్క్షణము ఢిల్లీకేతెంచి కనూజియందు జరిగిన సమాచారముఁ జక్రవర్తికిఁ దెలియఁ బఱచెను. అతఁడును రోషపూరితుఁడై యిక నాలస్యముఁ జేసిన కార్యములేదని సేనాపతులనెల్లరఁ బిలుపించి యుద్ధమునకు సర్వసిద్ధులై యుండవలసినదని యాజ్ఞాపించి తాను సంయుక్త మందిరమున కేగెను. అట రాణివాసమున నున్న సంయుక్త యు దనతండ్రి చేయుచున్న చేష్టలకు జింతాకులయై కూరుచుండి యుండ బరిచారక లేతెంచి చక్రవర్తి వచ్చున్నాడని తెలిపిరి. తోడనే యామెలేచి మగని కెదురు వోయి నమస్కరించి కొనివచ్చి తల్పమున నాసీనుం జేసి యతని ముఖమించుక వన్నె దరిగి యుండు టవలోకించి మెల్లగా నిట్లనియె. " నాథా నేడు మీ వదనము క్రొత్తగ నున్నది. అందులకు గారణమే నెఱుఁగుదు. దీనికి మీరు చింతించవలసిన పనిలేదు నా తండ్రియిట్టి కుమార్గగామి యయ్యేనని వినుటకు నా కెంతయో లజ్జగనున్నది. యుక్తా యుక్త వివేచనలేక యతడు చేయగడగిన దుష్కార్య ముల గూర్చి విన్నకొలది నా కమితమగు రోషము గలుగుచున్నది. ఇతడు నా జనకుడైన మానె. ఇట్టి దేశద్రోహులు బ్రతికి యుండుటకన్న మరణించుటయే మేలు. అయ్యో ! అతడే సజ్జనుడై మన యందఱతో గలసియున్న నే నిప్పు డెట్టి యుల్లాసస్థితి యందుందునో కదా. అట్టిభాగ్య మీ నిర్భాగ్యురాలి కీజన్మంబున గలుగనేరదు. అతని విషయమై మీ రావంతయైన

195