ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


యున్నాము. అట్టి విషయములో నాచే నోటువడి యావల లాహోరు దుర్గమును బోగొట్టుకొని యార్యావర్తమునందు నిలువ నీడలేక స్వదేశమునకు బరువెత్తిపోవుచున్న సుల్తానునకు నీవు తోడుపడుచున్నావని వినుటకు నా కెంతయు జింతగ నున్నది. నీ వింతటి యజ్ఞాని వేటికైతివో యూహింపజాలకున్నాను. మనమందఱముగలసి పరులఁ బారదోలుట లేకపోవఁ బురులకే సాహాయ్య మొనర్చి నాపైఁ బంపు టెంత వెఱ్ఱితనము. మన చుట్టుప్రక్కలనున్న దేశములవారిట్టి యజ్ఞానంపుఁ గృత్యముల సలిపిరని యెన్నడైన వినియుంటివా? కావున నికనైన నిట్టి యవివేకపు గార్యముల నొనర్చుటుడిగి సుల్తానుతో మైత్రి వదలుము. నీభావి సౌఖ్యమునకు భంగముకలిగించు కొనకుము. నీకు భయంపడి యిట్టిలేఖల వ్రాసితినని తలఁపకుము. అన్యు లేతెంచిన మనమెల్లఱ మేకీభవించి వారి దరిమివైచి మాతృ భూమిం గొపాడుకొను విధి మనదై యుండుటవలన నిట్లు . లిఖించి నాడగాని వేరొండుగాదు, నాతోగల వైరమే ప్రధానముగ జూచుకొనకుము. అని వ్రాసి ధీయుతుండగు నొక రాయబారిచేతి కొసఁగి పంపి నాటికిఁ గొలువుజాలించి వెడలిపోయను. రాయబారి కతిపయదినంబులకు గన్యాకుబ్జమునకేగి రాజసభా ద్వారముఁ జేరి లోపలికి జెప్పిపంప నిపుడు సందర్శింస వలను కాదని జయచంద్రుడు ప్రత్యుత్తర మంపెను. మరునాడు నట్లే జరిగెను, అనంతరము నాలుగైదు దినములు గడిచిపోవ సప్పుడు సట్లే జరిగెను. వచ్చినప్పుడెల్ల రాయబారిం జూడ

194