ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియేడవ ప్రకరణము


నిశ్చయమే అయినను నే కార్యములు కాని సాధ్యమగునంత వరకు సామ్యముననే చక్క పఱచుకొను టుచితము కాన మరల మిత్రబంధు భావములతో నా జయచంద్రున కొకలేఖవ్రాసి పంపుము. పిదప సంగతులన్నియు విశదములగును. అనఁ జక్రవర్తి " విజ్ఞానశీలా ! నీవు చెప్పునవి యన్నియు బక్షపాత రహితుడును నసూయా విహీనుండును నగువానియెడ ఫలించుగాని యీ దుర్మార్గునియెడ సఫలములగునా ? మఱియు మన మెంత సామ్యమున వేడుచున్న యంత మనతలకెక్కుఁగాని యతడు మంచి మార్గమునకు వచ్చుననుట కల్ల. అయినను నీ.మాటఁ గాదనను. నీ యాలోచన ప్రకార మటులే పత్రిక వాసిపంపెద" నని యొక లేఖ నీ క్రింది విధముగా వ్రాయఁ దొడగెను

స్వస్తిశ్రీ కన్యాకుబ్జ పురాధీశుడగు జయచంద్రుని సన్ని ధికి. “ నీ వార్య సంతతివాడవై నందున మనమందఱము బంధువులమై యున్నాము. అదియుంగాక మనకిద్దఱ కిప్పుడు మఱింత దగ్గర బాంధవ్యము చేకూరినది. భాంధవ్యముమాట యటులుండ నిమ్ము. పరస్పర కలహములులేక మనమందఱము గలిసియుండి మాతృభూమిని రక్షించుట మనకు విధియైయున్నది. పరదేశముల వారలీ దేశముపై దండెత్తి వచ్చినప్పు డొక్క భావముతో నందర మేకమై వారిఁ దరిమివేయకున్న మనకీ రాజ్యములు నిలుచుట దుర్లభము. ఇదివరకే మనలో మనము వైరముబెట్టుకొని మనప్రజల ' కనేక గతులబాధలు కలగఁజేసి

193