ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


బయటికి వచ్చుచున్న కోపము నాపుకొని మరల నక్షౌహిణీపతులతో "సేనానులారా! మీ సేనా సమూహంబుల నన్నింటి జక్క పఱచుకొని రణమున కేగ సిద్ధముగ నుండుడు. మీ దేశమును రక్షించుకొన వలసిన సమయము వచ్చుచున్నది. జీవముల కాశింపక పోరాడి ప్రఖ్యాతి గాంచవలయు. పిరికితనము వహించి రణరంగమున వెన్నిచ్చి పారువార లిక్కడనే యాగిపొండు . అట్టివారల నేనెంత మాత్రము బలవంత పఱచను. ఇక్కడ ప్రగల్భములు పలికి రణమున బరువెత్తువారల కెట్టి కఠిన శిక్షనైన విధించెద. భారత యుద్ధమైన తర్వాత నింతగొప్ప సంగ్రామము జరిగినటు లెన్నడు వినియుండ లేదు. కాపున లేశమాత్రమైన బ్రాణములపై నాస బెట్టుకొనక తుదవరకు యుద్దమొనరించి పాండవ సేనా నాయకులంబలె శాశ్వత కీర్తుల నందుడని పలుక సేనాధి పతులంద ఱొక్క పర్యాయమున లేచి " రాజేంద్రా ! దేవరవారింతగ సెలవియ్యవలయునా? మారణ కౌశలము గాంచి మీరే యెప్పుడు మెచ్చుగొందురుగాక, ఇప్పుడూరక వచించిన బ్రయోజనమేమి? శక్తి హీనమగు పర్యంతము పోరాడుచుందు మని నిక్కముగ నమ్మియుండుడు. " అని యేక వాక్యముగ బలుక జక్రవర్తి సంతసించి వెండియు “మీ నేర్పునే నెఱుంగనా ! అయినను జెప్పవలసిన మాటలు చెప్పితి " ననెను. అత్తరి విజ్ఞానశీలుఁడు లేచి “మహాప్రభో ! నాదొక చిన్న మనవీకలదు. ఇప్పుడా జయచంద్రుడు చేయుచున్న కార్యములబట్టి యాలోచింప మనకెట్లును పోరుతప్పదు. అది

192