ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియేడవ ప్రకరణము


మానక మనదేశమున గాలుపెట్టుటకైన వీలులేక పారిబోవుచున్న సుల్తానులకు దోడ్పడి నాపై దండెత్తింప బ్రయత్నముల జేయుచున్నాడట. మఱియు మనదేశంబున గల యితర సామంతులను గూడ దోడ్కొ ని వచ్చెదనని మ్లేచ్ఛునకు వర్తమాన మంపినాఁ డట. ఈ జయచంద్రు నెంత బుద్దిహీను డనవచ్చును. వీని మూలమున మనదేశ మన్యుల పాలగు కాలము వచ్చినటులున్నది. ఈ విధముగ రణములపై రణములు చేయుచున్న నెన్నాళ్లని నిలువగలము. ఇదివరకైన యుద్దముల వలననే యమితమగు ధననష్టమును సేనా నష్టమును సంభవించి యున్నది కదా ! ఈ నీచునితో గలహ మాడ మొదలిడిన నాటి నుండియే మనప్రజల కెక్కడలేని యిక్కటులు కలుగు చున్నవి. అయ్యో ! ఈ జయచంద్రున కింతమాత్రము యుక్తాయుక్త వివేచన జ్ఞాన మెందులకు లేదా యని నాకు జింత కలుగుచున్నది. ఇంతవరకు మనయార్యా వర్తనము నందలి రాజు లేకీభవించి యుండుటచేతనే కదా పరదేశములవారు దీని మ్రింగివేయ గాచుకొని యుండియు నేమియు జేయజాలక యూరకున్నారు. ప్రస్తుతపు స్థితిని బట్టి విచారింప మనదేశ మన్యులపాలగుట రూఢీయని తోచుచున్నది. తనకంత నా పై గోపమున్న స్వయముగ దానొక్కడే నాపై దండెత్తివచ్చి జయముగొనరాదా ! అటులొనరింప జేతకాక మనకు బ్రత్యక్ష వైరులగు మహమ్మదీయులకా తాను తోడ్పడుట. వీడు కావించుచున్న కృత్యముల దలచినకొలది నా యొడలు మండుకొని పోవుచున్నవి. " అని

191