ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియేడవ ప్రకరణము

దానేశ్వరమువద్ద సుల్తానోడి పోయిన పిదప దన రాష్ట్రములలోని ప్రజలెల్లరు వేనోళ్ల బొగడుచుండ జక్రవర్తి రాజ్యమేలుచు సుఖముగ గొన్ని దినములు గడపెను. అనంతరము పరదేశముల మెలగుచున్న వేగులవా రరుదెంచి జయచంద్రుడు జేయుచున్న కుట్రల దెలియబఱచిరి. చక్రవర్తి యందుల కింతసేపు విచారించి యూరకున్న గార్యము లేదని మఱునాడొక గొప్పసభ జరిగించెను. అందు ప్రధానులు అక్షౌహిణీ పతులు మున్నగు రాజ్యమునకు సంబంధించిన గొప్పయధి కారులందఱలు వచ్చి పరివేష్టించి యుండిరి. ఆత్తరి బృధివీరాజు తానున్న పీఠమునలేచి నిలువబడి “సభికులారా ! నిన్న మనచారులు కొనివచ్చిన వృత్తాంతముల వినియే యుందురు. మరల నిప్పుడు చెప్పుచున్నాను జయచంద్రుడు మనతో బూనుకొన్న వైరమును

190