ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదీయారవ ప్రకరణము


మీదేశమునుండి తగినంత సేనను దెప్పించుకొని నాకా సమాచారము దెలియ జేసినతోడనే యితని వెంటగొని నే మిమ్ము గలిసికొనెదను. తమరు మీ మాట జెల్లించు కొనుకాలము సమీపించుచున్న " దని వ్రాసి ఘాజీఘాటువద్ద కేగి కుతుబుద్దీనుకియ్యమని చారుల చేతికిచ్చి పంపెను. కతి పయదినంబులకా చారులు మాజీఘాటు జేరి కుతుబుద్దీను కా జాబుల నియ్యనతఁడవి చూచుకొని సంతోష భరితుడై వాటిసమాచారము సుల్తాన్ గారి కెఱుకపఱచెను. గోరీయు మరల నార్యావర్తమున నిలుచుటకు నీడ దొరికెనని సంతసింపుచు గజినీ యందున్న దన తమ్మునకు చేతనైనంత సేనను వెంటగొని ఘాజీఘాటువద్దకు రావలసినదిగ దెలియ బఱచి పెచ్చు పెరిగిన మచ్చరమున నెప్పుడార్యావర్తపు జక్రవర్తిని గడతేరునా యని కాచుకొని యుండెను.

189