ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


ముని స్థాపించినదనియు, నా పుష్కరిణి దేవనిర్మిత మనియు, • నందులోని నీరుదక్క వేరొండభిషేకార్థము శివుఁడంగీకరింపఁ డనియు వచింపుచు నుత్సవమునకు వచ్చిన యాత్రాపరుల నందఱిని నా పాడునీటియందే ముంచుచుందురు. మఱియు నా పుష్కరిణియందు మునిగిపోయిన గాశీవిశ్వేశ్వరుని గుడియందు దేలుదురని ప్రతీతి యొకటిగలదు. గాని యటులొనర్చిన వాడు మాత్ర మొకడును గానరాడు. కన్యాకుబ్జమునుండి ఢిల్లీకిబోవు రాదారీ కొండప్రక్కగా బోవును. శివరాత్రినాడు మాత్రమేగాక యితర సమయములందును నా బాటనుబోవఁ దటస్థించిన భక్తులెల్లరు గుడికేగి స్వామిదర్శనము జేసుకొని పోవుచుందురు, ఇంత ప్రఖ్యాతివడసి మహోన్నత స్థితియందుండిన యీక్షేత్రము మనచరిత్ర ప్రారంభమగు నాటికి సంపూర్ణముగ శిథిలమై యుండెను. పదునొకండవ శతాబ్దారంభమున గజనీమహ్మదు ముత్రాపట్టణముపై దండెత్తి వచ్చినప్పుడీ కొండనెక్కి విగ్రహము లన్నింటిని ధ్వంసముచేసి మితిలేని ద్రవ్యమును గొనిపోయెను. నాటినుండియు నచటి మహత్వము చెడినందున దైర్థికులచటికేగుట మానివేసిరి. కాని తమదొర ప్రియజనకుండని జాలిబూని మూషిక వ్రజము మాత్రము శివలింగము మంచి స్థితియందుండునపుడు భక్తులనేకులు వచ్చి యుపచారములు సలుపుచుందురు గదాయని కొంచె మశ్రద్ధజేయుచు వచ్చినను భక్తుడొక్కడైన రాని యిట్టి దీనస్థితియందు దాముమాత్రము వదలక దమ జాతివారల నింకను ననేకులఁ గూర్చుకొని

20