ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


నుండవలసిన దని యతని కదివరకే తెలిపియుంటిని. ఇప్పుడు వారికి లాహోరు దుర్గసహితము పోయినందున నక్కడనే విడసి యుందురు. ఆఫ్‌గన్‌స్థానము నుండి నూతన సైన్యమును దెప్పించు కొనవలసినదిగా వారికిప్పుడు తెలియ పఱచెదను" అన జయచంద్రుడు యుక్తాయుక్తముల విచారింపక భట్టుగారు వచించిన దంతయు దనకు లాభకరమేయని తలచి పట్టియున్న యసూయాపిశాచమును వదలించుకొన జాలక రాక తక్కిన తన మిత్రులగు నితరరాజులకు మరల వర్తమానముల నంపెను. అంత నాటికి సభజాలించి యందఱు వెడలిపోయిరి. ఈశ్వరభట్టు వినయశీలుడు పోయినందుల కత్యంత సంతోష భరితుడై తననిలయమున కేగి కుతుబుద్దీనున కీ క్రిందివిధమున లేఖవ్రాసి పంపెను.

"ఆలీసర్కార్ కుతుబుద్దీన్ నవాబ్ గారి దివ్య సముఖమునకు మీ మిత్రుఁ డీశ్వరభట్టు విన్నవించు కొనున దేమన :---

ప్రస్తుతము మీకుగలిగిన పరాజయమువలన నాకపరిమితమగు దుఃఖము గలిగినది. అయినది కానిండు. మీ రెంత మాత్ర మధైర్య పడవలదు. ఇక్కడ జయచంద్రుని బూర్తిగ నా వలలో వేసికొన్నాడను. నా పలుకన్న జవదాటడు. మీకుదోడ్పడి చక్రవర్తి నెదురింప నిశ్చయించు కొన్నాము. మఱియు వినయ శీలుండు నేడు తనపనికి రాజీనామా యొసగి పోయినాడు. ఇక జయచంద్రునకు నాకు విరుద్దముగ జెప్పువారెవరును లేరు. మీరు

188