ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియారవ ప్రకరణము


ఇంతగా వచింపుచున్నను నా మాటలయందు నీకించుకైన విశ్వా సము గలుగలేదుగా. ఆసన్నకాలము సమీపించిన వాడు తన మేలుగోరి చెప్పు మిత్రుల బాటింపడనుట కిప్పుడు నీవు నిదర్శనముగ నగపడుచున్నావు. అంత నామాటలయందు నీకు నమ్మకముగలుగనిచో నా కీకష్టమంతయు నేటి" కని తన ప్రధానికత్వమునకు రాజీనామా యొసంగి వెడలిపోయెను. వెంటనే భట్టుగారు లేచి " రాజా ! ఇకడు తాను బెదరించిపోయిన నీవు భయపడి మరల నతనికాళ్లు పట్టుకుందువని యిట్లు కావించినాడు. ఇప్పుడు నీ కెంత మాత్రము భీతికలుగుట కవకాశములేదు. ఇతడు పోయిన నిన్ను నిరుత్సాహ పరచువారు లేకుండబోయి రంతియేచాలు. నీ వింతకాల మితని ప్రధానిగబెట్టుకొని రాజ్య మెటులొనరించుచుంటివో నా కాశ్చర్యముగ నున్నది. ఇటువంటి పిరికిపందల మంత్రులుగా నుంచుకొనుట నీ దేతప్పిదము. అందుకొఱకే యితని విషయమై నీతో నెన్ని పర్యాయములో వచించి యుంటి. అప్పుడు నా మాట వినకపోతివి. ఇప్పుడెవరు పొమ్మనకుండ దనంత దానేవెడలి పోయినాడు. శత్రువుపైకి నేతెంచి తలనరుక నున్నప్పుడు కూడ సూరకుండుమని వచించు నంతటివాడే. కానిమ్ము : ఇకనైన నీవు బాగుపడు నుపాయము చూచుకొనుము. మన మిదివరకు వ్రాసిపంపిన లేఖల జూచుకొని కొందఱు వచ్చిరికదా ! తక్కిన వారికి మరల వ్రాసిపంపుము. ఇంతలో నేను గుతుబుద్దీన్‌కు వర్తమాన మంపెదను. ఒక వేళ జక్రవర్తిచే నోటమికలిగిన మరల లాహోరునకు బోక సింధునదీ తీరమున ఘాజీఘాటు వద్ద

187