ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


లోఁబఱచుకొని వానిచే నిట్లు బలికించినాఁడు అదియుంగాక నీతండు చెప్పినదినమున నేనిల్లువదలి బయటబోకుండినట్లు మీకు సాక్ష్యమిప్పించెద " నని నల్గురుమనుజులు బిలువనంపి వారిచే నట్లేచెప్పించి వెండియు నిట్లనియె. ఇతఁడు నా మిత్రుల విరువుర దేవశర్మ చంపినట్లు వచించు చున్నాఁడు గదా ! వారల నిద్దఱి గుతుబుద్దీన్ వద్ద కనిచి యుంటినో లేదో యతని దగ్గర నుండియే లేఖ దెప్పించి మీకుఁ గనుబఱచెదను. అని ఖండితముగఁ పలుక జయచంద్రుఁడును దనకూతురు విషయమై యంతగా విచారింపకున్నాడు. కాన భట్టువారి వాక్యములనే విశ్వసించెఁగాని వినయశీలునిమాటలఁ బాటిగొనఁడయ్యెను. అంత దానెన్నిగతుల వక్కాణించినను దన్ను లెక్కగొననందున వినయశీలుండు కోపమూని “దుర్మార్గులారా ! మీబోటివారలున్న రాజ్యమెన్నటికైన గుదుటఁబడునా? మీమూలముననే యిదివరకుఁ జక్రవర్తితో యుద్ధముకలిగి లక్షలకొలదిగనున్న సేనయంతయు నాశనమైనది . అనేక తరములనుండి ప్రఖ్యాతిమీరి వచ్చుచున్న గన్యాకుబ్జరాజ్యము నేటికి మీకారణమున నిర్మూలము కావలసివచ్చినది " అని సభవారింగూర్చి పలికి నృపునివంకకు దిరిగి " జయచంద్రా ! నావాక్యముల నించుక విశ్వసింపుము. చక్రవర్తితో వైరమూనకము. మ్లేచ్చులఁ జేరదీయకుము. అట్లు చేరతీయుట వలన నీ మాతృభూమి కంతయు నపకారము గావించినవాడవగుదువు. నీ మౌర్ఖ్యము విడువుము. " అన జయచంద్రుఁడేమియు బ్రత్యుత్తర మీయకుండెను. అంత మరల వినయశీలుడు " ఏమి !

186