ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియారవ ప్రకరణము


చంద్రుఁడు నట్టియుద్దేశమునే కలిగియుండెను. ఇంతమంది మూఢుల లోపల నొక్క వినయశీలుఁ డేమిచేయ గలుగును ! అయినను వినయశీలుం డూరకొనక మరల " రాజచంద్రా ! అసూయాపరుండవై కుమార్గగాము లగువారి వాక్యము లాలించి యేల నిష్కారణముగఁ జెడిపోయేదవు. పక్షపాతవిహీన మతివై బాగునోగుల విచారించి చూచుకొనుము. ముందు నీవంశమున జన్మింపబోవువారల కీదేశంబునఁ గాలునిలుపరాకుండఁ జేయకుము. అనేకవేల సంవత్సరముల నుండియుఁ బరదేశములవారిచే మన్ననలందుచు వచ్చుచున్న మనదేశమును ధ్వంసము సేయకుము. ఆదియుంగాక యీభట్టుగారు నీయెడ నేవిధమైన ద్రోహము దల పెట్టి యుండలేదని వచించు చున్నాఁడు కదా? ఒకనాడీ మూడుఁడు వీనియనుచరు లిరువురును నీకొమార్తెను గడతేర్ప నిశ్చయించినారు. దేవశర్మమూలమున వీనిమిత్రుల కిరువుర కానాఁడేమృతికలిగి సంయుక్త కాగండము కడచిపోయినది. ఇతండు నీయొద్దదప్పించుకొనుటకై వారిని సుల్తాన్‌కడకు బంపి యుంటినని వచించినాఁడు. వీనిరహస్యము లన్నియు నితనివద్ద నున్న కంచుకికి బాగుగఁ దెలియును. కావలయునన్న నతని దెప్పించి యడిగిచూడుఁ" డన గంచుకిని బిలుపించియడుగ నతండు వినయశీలుండు వచించిన ప్రకారమే చెప్పెను, అత్తరి భట్టుగారు వినయమంతయు దన మొగముననే తాండవమాడలేచి " మహాప్రభో ! వీరలు వచించునదియేమో నాకుం దెలియకున్నది. ఈవినయశీలుండు మెల్లగ నాకడనున్న కంచుకుని

185