ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


కుండనైన నూరకుండక మనదేశమందు నిలువనీడలేక పారిపోవుచున్న సుల్తానును మరలఁ బిలిపించి యతనికిఁ దోడ్పడుటెంత వెఱ్రిదనము. ఇదివరకు లాహోరు వాస్తవ్యులగు నార్యు లెందఱు తమదేశమును త్యజించి మనకడ కేగుదెంచి మ్లేచ్చులు పెట్టిన బాధలఁ జెప్పుకొని యేడువలేదు. నీవు సహాయమొనరింపకున్నను జక్రవర్తి యతని బారదోలినాడని వినుటకు నా కెంతయుఁ సంతసముగ నున్నది. నా మాటఁ బాటించి నీ వింతటితో నూరకుండుము. కుత్సితుడగు నీ భట్టువాక్యములు వింటివా నిక్కముగఁ జెడిపోదువు. " అన భట్టుగా రుగ్రుఁడై లేచి “రాజేంద్రా ! మానాభిమానములుకలవా రెవ్వరు నిట్లువచింపరు, నీవు సుల్తానుకు సాహాయ్యపడఁబోవుచున్నా వసుటేల ? అతనినే నీవు సాయముగఁ దోడ్కొని చక్రవర్తిపై దండెత్త నున్నావని యేల తలఁపరాదు, నేను నీ నాశనము గోరి యొక్కనాటికి వచింపను. క్షత్రియుండగువాడు తన వైరము దీర్చుకొనంజాలక యాడుదానివలె నింట గూరుచుండి యున్నచో దన ప్రజలకే తనపైగల యభిమానము దప్పిపోవును. అట్టియెడ నిన్ను ప్రోత్సాహము చేయుచుంటిమే కాని మే మేమియు నాశనము చేయుటలేదు. మీదు మిక్కిలి యీ ప్రధానివంటివారలే నిన్ను నిరుత్సాహ పఱచుచు నడ్డంకులఁ గల్పించి చెప్పుచున్నా " రనెను. దండనాయకులు మొదలగువార లంతకు మునుపే భట్టుగారిచే బోధితులై యుంటవలన వారును సుల్తానునకు సహాయ మొనరింప వలయుననియే పలుకుచుండిరి. జయ

184