ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియారవ ప్రకరణము


మంత్రులు, దండనాయకులు మొదలగు వారందఱు బరివేష్టించి యుండిరి. ఈశ్వరభట్టుచే ప్రేరేపింపఁబడినవారలై నేనాపతులందరు సుల్తా౯గారికి దోడుపడవలయుననియే వచించుచుండిరి. వినయశీలుఁ డొక్కడు మాత్రము వలదని వారించుచుండెను. అత్తరి రాజుగారు మ్లేచ్చులకు సహాయమొనరించియే తీరవలయునని వచింప వినయశీలు డిట్లనియె. "జయచంద్రా! పూజనీయంబగు నార్యావర్తమును గోహంతకులగు గ్రూరులపాల నేలఁ బడవైచెదవు. ఇదివరకు మన ప్రజలనుభవించిన బాధలవినియు మరల నిట్లేల కావించెదవు? చక్రవర్తిపైగల నసూయవిడ నాడుము. నీ కతడు చేసిన యపకార మేమికలదు. నీవే విచార విహీనుండవై మున్ముం దతనికి నిష్టూరముగ లేఖ నంపినపిదప నీపై దండెత్తి వచ్చెనఁట గాని నీ వతని నవమానపఱచిన సంగతి వినియు నూరకుండెనని వివియుంటిని. స్వార్ధపరులును దురాలోచనా సంగతులునగు నీశ్వరభట్టు మొదలగు వారి పల్కు. లాలించి నిష్కారణముగ నేలచెడిపోయెదవు. ఇతడు నిన్ను నాశనము గావించి తానును నాశనమగునట్టి కుయుక్తులే వచించుచుండుగాని నీ మేలుఁగోరి చెప్పుటలేదు . పరదేశములు రాజులు మనదేశముపై దండెత్తి వచ్చినపుడు మనకదివరకున్న మనస్పర్దల సహితము వదలుకొని యందఱ మొకటిగాఁగూడి దేశమును రక్షించుకొను నుపాయము జూడవలయుఁగాని పరులకు సహాయ మొనరించు టెక్కడనైనఁ గలదా? నీవును జక్రవర్తియుఁ గలిసి మ్లేచ్చులఁ బారదోలుటకు మారు నీవూర

183