ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియారవ ప్రకరణము

సుల్తా౯ షహబుద్దీన్ మహద్‌గోరీగా రటుల నార్యచక్రవర్తి సేనచే నోడింపబడి లాహోరు దుర్గముసైతము వోయినందున విచారమగ్నుడై యార్యావర్తము జయించునాస యడుగంట నాకస్మికముగ నెవరైన నెత్తివచ్చిన నెదురింపదగిన సేనయు లేమి నిక నిటనున్న ప్రాణాపాయకరమని తక్షణమ నాఫ్‌గ౯ స్థానమునకేగ బయలు వెడలి సింధునదిం జేరి కుతుబుద్దీన్ సలహా ప్రకారము ఘాజీఘాటుయొద్ద విడిసెను. ఈ వార్తలన్నియు గన్యాకుబ్జనగరమున దెలిసినవెంటనే జయచంద్రునకు గలిగిన కడుపుమంట యింతింతని వచింప నలవికాదు. ఇతనికి మఱింత రోష మెక్కించుటకుగా నీశ్వరభట్టు పూనుకొని యుండెను. ఆ మఱువాడు సుల్తానుగారికి సహాయ మొనరించుటఁ గూర్చి యొక పెద్దసభ గావించిరి. దానియందు బ్రధానులు,

182