ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


ప్రక్క నేయుండిరి. అత్తరినాకస్మికముగఁ గపిలుండు వెనుకఁదాకెను. గోరీసంభ్రమాన్వితుఁడై బాక్షూ, షాప్దర్ జంగులను నిరువురు నిపుణులగు సేనానులఁ గపిలుని నెదురించి పోరాడఁ బనిచెను. నల్దిక్కుల నార్యులు ముట్టడివైచియుండుటవలన మ్లేచ్చవాహిని యల్లకల్లోల మగుచుండెను. అట లాహోరుదుర్గమున నార్యులుక్కు మీరినరోషమునఁ దెగఁబడి మహ్మదీయుల నఱికిపారవైచుచుండ వారిదాటీ కోరువజాలక తుదకు మఱియొకవారమగునప్పటికి సష్రాఫ్ కాలికి బుద్ధిచెప్పి పారిపోయెను. సేనానాయకుఁడు కానరాకుండుటవలన మిగిలియున్న మ్లేచ్చ సైనికులు నిరుత్సాహులై యంత్యసాహసముఁజూపి మడియు చుండిరి. మరికొందఱష్రాఫ్‌మార్గము నవలంభించుచుండిరి. మూఁడువారములు కడచునప్పటికీ మహమ్మదీయులు పూర్తిగా నాశనమై కోట సామర్శి స్వాధీనమయ్యెను. తన విజయవార్త చక్రవర్తికి దెలియబఱచి దుర్గముయొక్క శిథిలములైన గోడలు బాగుచేయించి వాటి పై ఫిరంగుల నెక్కించి మరల దన్నెవరైన వెదురింపవచ్చిన నోడించుటకు సామర్శి సంసిద్ధుడై యుండెను. ఇట ధానేశ్వరమువద్ద నొకమాస మగునప్పటికి మ్లేచ్చసేన విస్తారభాగము నాశనమయ్యెను. అంత సుల్తాన్ దాను లాహోరు నుంచి వచ్చిన నైన్యముం గొనిరమ్మని చారులవల్ల నష్రాఫ్‌కు వర్తమానమంప వారు తిరిగివచ్చి యక్కడి సమాచారము నెఱిఁగించిరి. సుల్తాన్ మహమ్మద్‌గోరీ లాహోరు శత్రువుల పాలైనదని విని భయోపేతుఁడై యిక నటనున్న దనకు

180