ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము


వేల సైన్యమును వెంటగొని లాహోరును ముట్టడించెను. ఆ దుర్గమును సుల్తాన్ లేనికాలమున నష్రాఫ్ అనువాడు నలువదివేల సైన్యముతో గాపాడుచుండెను. సామర్శి దండెత్తి వచ్చుటవిని యష్రాఫ్ తన సేనను దగుస్థలములందు నమర్చి రణమొనర్చి శాత్రవులఁ బారఁదోలవలయునని యాజ్ఞాపించెను. వారు నట్లే యుద్ధమొనరింప సాగిరి. సామర్శి సైనికులు ఫిరంగులఁ గోటగోడల చివరలకు గురిపెట్టికాల్పుచు గోడలపైకి మహమ్మదీయులు రాకుండ జేయుచుండిరి. మ్లేచ్చులును సుల్తాన్ లేనితరి నెటులైన మాట దక్కించుకొన నెంచి పరాక్రమముమీర వైరులకుదారి దొరకకుండ బోరాడు చుండిరి. సామర్శి యెటులైన లాహోరును మరల నార్యులవశము చేయ నదను కలిగెనని తనవారల కత్యంత ప్రోత్సాహమొసంగుచు రణము సేయించుచుండెను. ప్రాణముల కాశింపక సాహసధైర్యములతో నార్యసైనికులు పోరాడుచు వారముదినములకుం గోట బహిర్ద్వారముల భేదించుకొని లోపలం బ్రవేశించి రిపుల నురుమాడఁగడఁగిరి. ఇక్కడ ధానేశ్వరమువద్దనున్న మ్లేచ్ఛులు కుంభీలకుఁ డేర్పర్చిన యర్ధచంద్రాకార వ్యూహమున చేదీంప జాలక వేలకొలఁది మడియుచుండిరి. ఒకవారమగు నప్పటికి మహ్మదీయసేన సగమునాశనమయ్యెను. అత్త రి కుంభీలకుండు కపిలుండనువానికి గొంత సేననిచ్చి శత్రువుల వెనుకవైపునం దాకబంచెను. మహ్మదీయు లార్యసేన సకలము దమముందున్న దనియే భావించిరిగాని నిపుణులగు సేనానులు మొదలగు వారలీ

179