ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము


విఘ్నేశ్వర దేవాలము కలదు. ఈ క్రిందనున్న గుడికిని పైయాలయమునకును నడుమ గాళికాశక్తి గుడిఒకటి యుండును. ప్రాకారముయొక్క లోపలిభాగమున వరుసగా విఘ్నేశ్వర, కాలభైరవ, వీరభద్ర, కామాక్షి మందిరములును గలవు, ఇదిగాక గోడలకంట నిర్మింపఁబడిని చిన్న చిన్న గదులనేకములు బారులు దీరి యుండును. ఈ శివాలయమంతయు ననగా గర్భగుడి యంతయు నల్లనిరాళ్ళచే నిర్మింపబడియున్నది. గర్భగుడి యెదుట విశాలమగు నొక గొప్ప మంటపము గలదు. ఈ పెద్ద మంటపముస కిరుపార్శ్వములఁ జిన్నచిన్న మంటపములు రెండు కట్టబడియున్నవి. ఇందొకటి కళ్యాణమంటపము. పెద్ద మంటపములో విగ్రహమున కెదురుగ సాధారణపు మానవుడు పరుండగలిగినంత విశాలమగు బొడ్డుగల పెద్దనంది యొకటి యుండును. ఇచట బ్రతిసంవత్సరము శివరాత్రినాడు గొప్ప యుత్సవము జరుగుచుండను, ఆ దినమున యాత్రాపరులు వేన వేలుగఁ జనుదెంచి స్వామిసేవ జేసుకొని కానుకలర్పించి పోవుచుందురు. క్రిందనున్న వినాయకుడి గుడిప్రక్క దిప్పకంటుకొని కోనేరొకటి యుండును. ఈ కోనేరతి యగాధమగు లోతుగలదై పైనుండి నీటిమట్టమువరకును మెట్లనొప్పియున్నది. ఇందలి నీటికిఁ గ్రమమగు వాడుకలేని కారణమునను, దగినంత సూర్యరశ్మి తగులని హేతువునను బచ్చపడి యొకవిధమగు దుర్గంధమును వెలువరించుచుండును, అచ్చట ననారతము సేవఁజేయుచుండు భక్తులగు నర్చకులు కొందఱు ఆలింగ మగస్త్య మహా

19