ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


గంటవేళ సేననంతయు వెనక్కు మఱలవలసినదని యుత్తరువు జేనెను. కుతుబుద్దీ నాజ్ఞాపించిన మ్లేచ్ఛవాహిని వెన్నిచ్చి పాఱుచుండు టవలోకించి కుంభీలకుఁడు వారి వెంటఁదగిలి తరుమ దనవారీ కాజ్ఞాపింప నార్యులు విజృంభించి మహమ్మదీయులఁ దరుముకొని పోవసాగిరి. ఇటులు సార్వభౌమ సేనచే వెంబడింపబడినవారలై మ్లేచ్ఛులు ధానేశ్వరమువద్ద కేగునప్పటికి సుల్తాన్ ప్రబలసేనా పరీవృతుఁడై యెదురుగఁ జనుదెంచుచుండెను. సుల్తాన్ పరుగెత్తుకొని వచ్చుచున్న తన సేననాపి మరల యుద్ధమునకుఁ బురికొల్పెను. ఈ సుల్తాన్ మహమ్మద్ గోరీ వెంటవచ్చిన సైన్యమునందు బదివేల యాఫ్‌గనులును, నేనిమిదివేల యరబ్బులు, నిరువదివేల తురుష్కులు, మొగలాయిలు నుండిరి. కుంబీలకుఁడు వైరిసేన మిక్కుటముగ నుండుటగాంచి తనసేన సర్ధచంద్రాకార వ్యూహమునదీర్చి శాత్రవులఁ దాకఁ బంచెను. అంత మరల పోరు మహాఘోరమయ్యెను. వివిధ శస్త్రాస్త్రముల తాకుడుల వేలకొలది సైనికులు మడియుచుండిరి . ఇట్లిక్కడ ఘోరసంగ్రామము జరుగుచుండ నీ వార్త లన్నియు కుంభీలకుడు చక్రవర్తికిఁ దెలియబఱచెను. కుంభీలకుని లేఖల వలన సుల్తాన్ తన యావత్తుసేనను గైకొని లాహోరు దుర్గమును విడచి వచ్చినాడని తెలిసికొని చక్రవర్తి. తన ప్రాణస్నేహితుడును, బావమరిదియు మీర్వార్ పరిపాలకుడునగు సామర్శికి లాహోరును ముట్టడింప వర్తమాన మంపెను. సామర్శియుఁ జక్రవర్తి యాజ్ఞాపించినట్లు తనవద్దనున్న యేబది

178