ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము


గాచుకొనియుండెను. మఱియు గ్రామముల పైఁజడి దోచుకొనం బోయినగుంపులును వచ్చి యతని గలిసికొనెను. కాని కుతుబుద్దీన్ లక్షసైన్యము వచ్చుచున్నదనివిని తనవద్ద నేబది వేలసైన్యమే యుండుటవలన యమునాతీరమునందువలెనే మరల నపజయము కలుగునేమో యని భయమందుచుండెను సుల్తాన్ గారికొఱకు ప్రతినిమేష మెదురు చూచుచుండెను. ఇంతలో నార్యసేన దృష్టిగోచరమై ప్రబలాట్టహాసంబున జనుదెంచు చుండెను. మ్లేచ్చులును దమతమ యాయుధములదాల్చి రణమునకు దిగిరి. సుమారు పగలు రెండు గంటల వేళ యుద్ధము ప్రారంభమయ్యెను. తమ కదివరకు గలిగిన పరాభవము దీర్చు కొననెంచి మహమ్మదీయు లత్యంత పరాక్రమముతో బోరాడఁ గడఁగిరి. కాని తగినట్టి రణశిక్ష లేనివారగుటచే వందలకొలది నాశనమగుచుండిరి. ఆర్యులత్యంత నిపుణముతో నొక్కొక్క వ్రేటున కనేకమందిని నేలకు బలియిచ్చుచుండిరి. రణము మహా ఘోరముగ నుండెను. నిమిషనిమిషమునకు సుల్తాను వచ్చుచున్నాడో లేదో యని కనుగొనుటకుఁ జారులనంపుచు కుతుబుద్దీన్ సేన నుత్సాహపరచుచుండెను. మరుసటిదినము పగలు పదునొకండు గంటల వరకు మహ్మదీయు లత్యుత్సాహముతోఁ బోరాడుచుండిరి. అప్పటికిని సుల్తాన్‌గారి జాడలేమియు లేవయ్యే. అంత గుతుబుద్దీన్ తాఁదలచినంత యైనదని చింతించుచు వైరిసేన ప్రబలముగ నుండుటవలన దన కపజయము గలుగుట రూఢియని తలఁచి కొంచె మించుమించుగ నొంటి

177