ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


యన్నింటిసవరించుకొని పోవుచుండెఁగాని దినములు గడచిన కొలఁది బత్రికలెక్కువై తమరాజ్యమంతయు నల్లకల్లోల మగుచున్నట్లు తెలియవచ్చు చుండెను. అత్తరి మెల్లనఁ జక్రవర్తి బిలుపించి సంగతులన్నియు విశదపఱుపగా దనరాజ్యమునఁ దట్టి హంతకులుండరాదని మ్లేచ్ఛులకుఁ దెలియ పఱచవలసినదిగా నాజ్ఞాపించి యతఁ డూరకుండెను. ఎన్నియుత్తరువులు పోయినను మహ్మదీయులా రాష్ట్రము వదలకుండిరి, తుదకుఁ బ్రజలందఱు ఢిల్లీరాజ్యమును విడచి పోవుచున్నామని చక్రవర్తి కడకు లేఖల సంపిరి: పృధివీరాజా లేఖఁగాంచి తా నంతవరకు నుపేక్షఁజేసి నందులకు నొచ్చుకొనుచు నాక్షణమున శాత్రవులసమాచారము తెలుసుకొనిరా గొందఱు వేగులవారినంపెను. వారును వెడలిపోయి మరల జనుదెంచి మహ్మదీయులు లెక్కకు మీరిన సేనలతో హస్సన్‌పురమువద్ద నున్నారనియు వారినుండి కొందరు గుంపులై బయలుదేరిగ్రామములఁ గొల్లబెట్టుచున్నారనియు వచించిరి. అందుపైఁ జక్రవర్తికిన్క వహించి కుంభీలకొండను వాని సకలాక్షౌహిణీపతిగ నేర్చఱచి దుర్గర భీములనువారి వానికిఁ దోడిచ్చి యొకలక్ష సైన్యము హిస్సర్‌ పురమువైపున కంపెను. చక్రవర్తి యాజ్ఞందలఁదాలిచి కుంభీలకుండు నడుమదటస్థలగు నట్టి మ్లేచ్చులయొక్క బందిపోటు మూకల నాశనముగావించుచు హిస్సర్ పురమున కఱుగుచుండెను. సార్వభౌమసైన్యము వచ్చు చున్నదనివిన మ్లేచ్ఛసేనానాయకుఁడగు కుతుబుద్దీన్ సుల్తాన్ గారిని తక్షణము కొనిరమ్మని చారులనంపి తాను జాగరూకతతో

176