ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము

యోగి తాను వచించిన ప్రకారము మఱునాడు మహావైభవముతోఁ జక్రవర్తికిని సంయుక్తకును వివాహము గావించి నూతన దంపతుల దీవించి మరల వచ్చెదనని సెలవుపుచ్చుకొని వెడలిపోయెను. చక్రవర్తియు గమలాకరుండు సంయుక్తయే యని తెలిసిన పిమ్మటఁ బట్టరాని యానందమునొంది తనకట్టి యుత్తమసతి యర్ధాంగి యగుటచే గర్వమునందియుండెను, కొలువుకూటమునకేగుట మాని సదా యంతఃపురమందేయుండుచు వచ్చెను. ఇటులున్నను విజ్ఞానశీలుండుమాత్ర మేమరక జాగరూకుఁడై రాచకార్యములఁ జక్కబఱచుచుండెను. మ్లేచ్చుల దాడి కోర్వఁజాలకున్నామని పరగ్రామములనుండి యనుదినము లేఖలువచ్చుచుండెను. ప్రధానియు జక్రవర్తికి లభించిన నూత్న సౌఖ్యమునకుఁ బ్రతిబంధకము గలిగింప నిష్టములేనివాడై తానే

175