ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదినాల్గవ ప్రకరణము


నందుల కలుకపొడమి కమలాకరుఁ డెక్కడికో పోయియుండునని " అయ్యో ! నా ప్రియురాలి దర్శనము గలుగకబోయినను నతని గాంచుటవలన నింత సంతసింపుచుంటి. ఇక నెవ్వరిఁ గాంచి మోదమందుదు" నని వంతనొందుచు నటనుండ మనసొప్పక వనము బ్రవేశించి యందొక మూల సంచరించుచున్న స్త్రీ సంఘముంగాంచి యెవరోయని యించుక దగ్గరికేగి యందఱు తన పరిచారికా జనంబులై యుంట గుర్తించి వారి నచ్చోటు బాసిపొండని చెప్పుటకు మఱింత దగ్గరకేగి వారిమధ్య నవకళా నిధిబోలెనున్న సంయుక్తంగాంచి పెన్నిధింగన్న పేదవోలె సంభ్రమాక్రాంత చిత్తుఁడై కొంతతడ వామెను గనురెప్పలు వ్రాల్చక గనుంగొనుచు నలువఁబడి తుదకు " ఆహా ! ఈ తొయ్యలియేకదా ! నా మోహంపు మొలక. ఎన్నిదినంబులకు నా నేత్రసాఫల్యము గలిగినది. ఈ లావణ్యగాత్రి యీ యుపవన మెట్లుప్రవేశించెనో " యని యాశ్చర్యపడుచుండ సంయుక్తయు వాల్గన్ను లఁ దనప్రియుని వీక్షించుచుఁ దన్న తఁడు గాంచినతరి మరియొక వైపున జూచుచుఁ దలవంచుకొని నిలువబడి యుండెను. చక్రవర్తి యామె విలాపముంగని పట్టరాని తమకంబునఁ జేరవచ్చుచుండ జెంతనున్న పరిచారికలు పొదల మాటున కేగిరి. తోడనే యతఁ డామె పాణిగ్రహము గావించెను. అప్పుడు వారిరువురకు గలిగిన యానంద మింతింతయని వచింప నలవికాదు. ప్రవ్వేదముద్భవింప బులకలునిండార నిరువురు గొంత సేపటివరకు దేహములు మఱచియుండిరి. అప్పటి వారి

173