ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


సంఘమును మ్లేచ్ఛులూరిబయట నుండగనే వారిపై నడిపించితి. గ్రామస్తులు నాయుత్సాహంపు వాక్యములచే దైర్యమూని శత్రువులతోఁ బోరాడి చివరకు నందరి వధింపఁ గొద్దిమంది తప్పించుకొని పరువెత్తిరి. మరల నట్టి సమయము తటస్థించిన బోరునకుఁ బురికొల్పుకొని పోవుట కొకని నేర్పరచి నేనిట్లు బయలువెడలి వచ్చితి," అన "తండ్రీ! నా యెడఁ జక్రవ ర్తికి గల యనురాగ మంతయు వెల్లడియైనది. అతఁడు నిద్రహారంబులు మాని కృశించుచున్నాడు. ఎటులైన నతని వాంఛితంబు ద్వరలో దీర్పు " మన కుమారీ : నేడే నీకోర్కె నెరవేర్చెదను. నీ విఁక నీ పురుషవేషము నుజ్జగించి చెలికత్తెలఁ గూడుకొని చక్రవర్తియుండు ప్రాసాదము చెంతనున్న కేళీవనిలో విహరించుచుండుము. అని యా నూత్నమనుజుఁ డాజ్ఞాపింప నామెయు నట్లనే యొనరింపఁ బోయెను. అనంతర మతఁడు బైరాగివేషము దాల్చి యప్పుడే సార్వభౌమ కేళీవనిం జేరి యేమిజరుగునో యని యొక పొదరింట డాగియుండెను. అంతఁ గొంతసేపటికి జక్రవర్తి సంయుక్త వచ్చి తన యంకతలంబున గూరుచున్నట్లొక కలగని దిగ్గున నులికిపడిలేచి యెవరును లేకుండుటచే విభ్రాంతుఁడై పార్శ్వవర్తులఁ బిలచి కమలాకరుఁ డెక్కడనవి యడుగ "నతఁ డుదయముననే లేచియెక్కడకో పోయినాడు. ఇంతవరకు మఱలిరాలే " దని వారు వచించిరి. చక్రవర్తి యా మాటలకు విచారమూని ప్రాసాదము నల్గడల వెతకిం చికార్యముగానక వెతంబడుచు హా ! 'మొన్నడిగి

172