ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదినాల్గవ ప్రకరణము


ద్వారము బయట నడుగు బెట్టినతోడనే యతనికి గల్గిన సంతసముఁగూర్చి యేమని చెప్పనగును ! ఉత్కంఠుడై యెవరికొరకు నింతకాలము గనుపెట్టుకొని యుండెనో యతఁ డెదురుగ వచ్చుట సంభవింప నతని పాదముల కెఱఁగి యేకాంతమగు చోటికిం గొనిపోయి వృధివీరాజు వృత్తాంత మంతయు నెఱుకపఱచి " తండ్రీ ! ప్రతినిముసము నీ రాకకై యెదురుజూచు చున్నాను. వచ్చెదనని చెప్పిన గడువునాటికి రాకుండుటకు మీకేమి యాటంకములు సంభవించిన" వన నావచ్చిన మనుజుడు " కుమారీ ! ఇల్లు బయలుదేరినది మొదలన్నియు నాటంకములే. చుట్లుపట్ల మ్లేచ్ఛులు చేయుచున్న యార్భాటము లెక్కువైనవి. గ్రామస్తులున్న యూళ్ళవదలి యడవుల పాలగుచున్నారు. ఎవరెట్లగుచున్నను ముందు జన్మింపబోవు వారలకు నాధారములగు గ్రంధజాలములు నాశనమైపోవుచున్నవి. నేను మీతో వచించిన ప్రకారము మొన్నటికే రాకపోవుటకుఁ గారణము వినుము. ఇక్కడ కరువదిమైళ్ళ దూరముననున్న యొక యూరిలోఁగల గొప్ప పుస్తకభాండాగారములు మ్లేచ్ఛులు తగులఁబెట్టి తత్గ్రామ వాసుల నాశనముచేయ నున్నారవి విని యా యూరికేగి నిరాధారులై విలపించుచున్న యక్కడివారి నందఱఁ బురికొల్పి మహమ్మదీయు లేతెంచిన నెదురింప సిద్ధము చేసితివి. అంత నానాఁడు ప్రొద్దుగ్రుంకిన యెనిమిది గంటలకుఁ గొందఱు మ్లేచ్చులు మండుచున్న కాగడాల బట్టుకొని గ్రామము బ్రివేశింపఁదొడఁగిరి. అత్తరి నేసిద్ధము చేసియుంచిన గ్రామవాస్తవ్య

171