ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


నున్నదో వచింపు" మని దీనముగ వేడుకొనుచున్న చక్రవర్తి యవస్థనంతయు గాంచి కమలాకరుఁ డేమియుఁ జేయఁజాలక యూరక నిలచియుండెను. అత్తరిఁ జక్రవర్తి యుస్సురని నిట్టూర్పులు విడచుచు “హా ! మనోహరిణీ ! నన్నిట్టి బెట్టిదములకుఁ బాలుచేసి నీ వెచటి కేగితివి? ఇంత యవస్థపడు నన్నుఁ గాంచిన నీకు భయము గలుగదా? నా సహృదయస్థురాలవైన నాటినుండియుఁ దిన్నగ నిద్రాహారంబులుగూడ లేవు. రమ్మా ! ఏల జాలముఁ జేసెద" వని యొక సోఫాకుఁ జేరగిలంబడి కనులు మూసుకొనియుండఁ గమలాకరుండు చెంతకేగి యతని శరీరము నిమురుచు " రాజచంద్రా! లెమ్ము ! ఇట్టి దీనాలాపంబు లాడుట నీవంటి ధీరులకుఁ దగునా?" యన స్పర్శసౌఖ్యము నంది చక్రవర్తి దిగ్గునలేచి చెంత గమలాకరుఁడు దక్క పరులెవ్వరు లేకుండుటఁ జూచి విషణ్ణుడై కమలాకరా ! నీ కరస్పర్శనంబున నమితమగు నానందము గలిగినది. ఆహా ! నీహస్త మెంత మృదువుగనున్నది. ఇటుర " మ్మని చేరువఁ గూరు చుండబెట్టుకొని యేమేమో వచింపుచుండ నూకొట్టుచు “నయ్యో! నా యుపాధ్యాయుఁ డేతెంచి యితని మనోరధ మెప్పుడు దీర్చునోగదా” యని కమలాకరుండు తలవోయుచుండెను. ఇట్లు చక్రవర్తి చింతాకులుడై యుండ రెండురాత్రులు గడచెను. మూడవనాడు తెల్లవారి యేడుగంట లగునప్పటికి గమలాకరుండు నిదురలేచి ప్రాతఃకాల కృత్యముల నెరవేర్చుకొని చక్రవర్తి యప్పటి కింకను లేవనందున దా నొంటరిగ బయటికేతెంచెను.

170