ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది నాల్గవ ప్రకరణము


వంకరలై ముఖసరోజము నావరించియున్న యీ కన్నియ ముంగురుల స్పృశించి యేలచలింపఁజేయును?" అని మిక్కుటమైన మదనోన్మాదంబునఁ జిత్రపటిమను మాట మఱచి "మారుతాధమా ! నేను కట్టెదుటనుండ నా ప్రియురాలి వదనమేల స్పృశించెద " వని దండింపఁబోయి మరల దెలివి దెచ్చుకొని తాను గావింపఁబోయిన పనికి సిగ్గుపడుచు నిట్టూర్పుఁబుచ్చి యిటునటుఁజూడఁ గమలాకరుఁడ చెంతనుండెను. అత్తరి జక్రవర్తి మనస్సు నిలుపలేక యతని దరిజేరి "కమలాకరా ! ఇటు జూడుము. ఈ చిత్రపటమునందున్న కన్యకయొక్క రూప వైఖరులు నీయందుఁ గన్పట్టుచున్నవి. ఈపె నీకేమైనఁ గావలయునా?" అని యడుగ “రాజేంద్రా! శైశవమాదిగ నీకన్యయు నేనును నన్న చెల్లెండ్రభావముతో నొకటిగ నుంటిమి. మా ఇరువురరూప మొకటియే. ఇందు నీ వేమియుఁ దప్పుదలంపలేదు. రూపమొక్కటి యగుటవలననే జయచంద్రుడు మొదలగువారు మా యిద్దఱ నొకరీతిగఁ జూచుకొనుచు వచ్చిరి. ఇప్పుడీమె మారువేషముతో నెక్కడనో యున్నదని నాకొక యోగిచెప్పినాడు. మరల కొద్ది దినములలో మే మిద్దఱ మొకటియగుదు మను ధైర్యము నాకున్నది." అని కమలాకరుండు పలుక “బాలకా ! నీయీ చెల్లెలిం గాంచకున్కి నా కన్నులు వాచి యున్నవి. ఎటులైన నీమె దర్శనలాభము నాకుఁ గలుగఁ జేయుము. ఇన్ని దినంబుల నుండియు నీ వదన సందర్శనమున బ్రాణంబుల నిలుపుకొని యుంటి. ఈమె ప్రస్తుత మెచ్చట

169