ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


రోధముఁబాసి రాకున్న మానె; నాయందంత ప్రేమగలిగియున్న వనిత నా సమాచార మరయుటకై దాసీజనంబునైన నంపదా? నిక్కముగ నామెకేదో కీడుమూడి యుండవచ్చును. నన్ను వలచియున్నదను రోషంబున నొకవేళ జయచంద్రుడే యామే కపకారము గావించి యుండడుగదా? అయ్యో! నా ప్రేమంపు దొయ్యలి కట్టియపకారమే కలిగియుండిన యోగి నా వద్దకేతెంచి యట్లేలవచించును? " ఆమె కేవిధమైన భయమును లేదు. నీ విప్పుడు రాజధానికేగుము. ఆమె నచటనే పెండ్లియాడగల " వవికదా బైరాగిచెప్పినాడు. అతడు నాతో నబద్ధము లెన్నటికైన వచించునా? వచింపడు. అతని నప్పుడే నా వెంటగొని రాక పోవుట నాదేతప్పిదము. పాప మతడే యిక్కటులఁ జిక్కెనో? ఆ యిందువదన సుందర లావణ్యాంబు రాశినిఁ దేలని నాజన్మము నిరర్ధకము." అని పెక్కు గతుల విచారించుచు బైరాగిపోవునపు డిచ్చిన సంయుక్త చిత్రపటముం గైకొని " ఆహా ! పటము నందే యింత కళావిలాసమైయున్న నీ మోహనాంగి రూపము బ్రత్యక్షముగఁ జూడగల్గిన నెటులుండునో కదా? దీని చిత్రించిన చిత్రకారునకు బ్రాణముఁబోయు సామర్థ్యము లేకుండు టెంతయు విచారకరము. ఱెప్పలల్లార్పక సరసీమధ్యమందలి రాయంచల విహారములు గాంచుచున్నట్లీ బాలికెంతయో నిపుణముగఁ జిత్రింపబడినది. ఔరా ! మందయానంబున నీ వనీతల విహారము లొనర్చు మలయమారుతుఁడు నాకన్న నెన్ని మడుగులో ధన్యాత్ముడుగ గాన్పించుచున్నాడే. లేకున్న

168