ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదినాల్గవ ప్రకరణము


సందేహము నొందియున్నందున నేమనుకొనునో యని తుట్టతుద కడుగుటమాని సంయుక్తాకృష్ట హృదయుడై దినములు గడుపుచుండెను. ఇంతలో బైరాగి చనుదెంచెద నని చెప్పిన గడువును . మీరిపోయెను. అంత బృథివీరా జగ్గలమగు మోహంబున “హా ! నా ప్రియురాలి సమాచారం బెఱుంగక దుఃఖించుచుండ నాకడ. కేతెంచి నన్నో దార్చి కొద్ది దినములలో వచ్చి నిన్నుఁ గలిసికొనెదనని వచించిన బైరాగి యింతవరకు రాకతడయుట కేమికారణము? అతండు రావలసిన దినంబు నిన్నటితో గడచిపోయె. ఆహా ! ఆ సొగసులాడిం జేపట్టి సుఖించు భాగ్యంబు నా కేనాటికైన లభించునా? ఆతన్వంగి కరస్పర్శనంబున మేనుగరుపార నుల్లాసము నొందుభాగ్యము నా కెప్పటికైనఁ జేకూరునా? లజ్ఞానతాననయై మందహాసమొలుకఁ బలుకు నా చిలుకలకొలికి వాక్యామృత ధారలచే నా మనోరధ తృష్ణను బాపుకొనుపున్నె మేనాటికైన సంభవించునా? ఆ వన్నెలాడికై కదా! అంత ఘోరరణము గావించితి. తుద కాకన్నెను కన్నులారగాంచు భాగ్యమునకైన నోచుకొననైతి. కట్టా ! మే మందఱము రణంబున మునిగియుండ దుర్మార్గు లెవరైన నామెం గడదేర్చి యుండరుగదా? కాకున్న నామె జనకుండు నన్నంత నీచముగ రాతిబొమ్మను జేసి యవమానపఱచినతరి నా విగ్రహము మెడను బుష్పహారమువైచి నా యవమానమునంతయు బోగొట్టిన యా జగన్మోహిని రణమున జయముగొనియున్న నన్ను వీక్షించుట కేలరాకుండును. తానవ

167