ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదినాల్గవ ప్రకరణము

అట్లు చక్రవర్తి కమలాకరు నొకనిముసమైన విడచియుండఁ జాలక యతనియం దత్యంతానురాగము కలవాడై తుదకుభోజన శయనాదులయందు సహితము తనవద్దనే యుంచుకొని యొక్కొక్కపర్యాయ మహా ! ఇతని బురుషునిగ నిర్మించిన యా పరమేశ్వరు నేమనవలయు. వీని ముఖలక్షణములు కేవలము సంయుక్తనే పోలియున్నవి. నిక్కముగ నీతని వదనంబు లక్ష్మీవిలాసమున కాటపట్టయి యుంటచేఁ గమలాకరుఁ డను నామము సార్థకమగుచున్నది. అని వాని కులగోత్రాదుల నడుగ నుంకించి యతఁడేమని భావించునో యని యడుగమానుచు నడుగకున్న మనసు నిలువమిఁ దనలో నెవనిగాని నీ కుల గోత్రాదు లేమని యడిగిన దప్పగునా యనుకొని వెండియు నిప్పు డడిగినయెడల నిన్నిదినంబులనుండి నా చేష్టల గాంచుచు

166