ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


కూతురుపైగల రోషంబునఁ బరిచారికుల సహితము కసరికొట్టి పంపెను. అనంతరము భట్టుగారి సలహాప్రకారము బురిహర రాజతులునకు లేఖ వ్రాసిపంపి యానాటికిఁ గొలువుఁజాలించి వెడలిపోయెను.

ఇక్కడ నిట్లుండ రాజధానియందు జక్రవర్తి ప్రవేశించిన దినము ననేకములగు వేడుకలు జరిగెను. పురమెల్లడల నలంకరించి నల్లడల జక్రవర్తి జయము జాటించిరి. చక్రవర్తి నెదురింపవచ్చు వారలిట్లే చెల్లాచెదరుగ నెగరగొట్ట బడుదురని సూచించుభంగి కోటబురుజులపై నాటిన జయస్తంభములకు గట్టిన శ్వేతవచనంబు మిక్కుటముగ గొట్టుకొనుచుండెను. మఱునాఁ డొక గొప్పసభ జరిగెను. అందు సకలాక్షౌహిణీపతులు, సేనాపతులు, మంత్రులు మొదలగువార లాసీనులై యుండిరి. అత్తరి జక్రవర్తి సంగరమున దన్నురక్షించిన రాకుమారుని రప్పించి యుత్తమాసనం బొసంగి మన్నించెను. సభయందలి వారెల్ల నతని వేయిగతులఁ బ్రస్తుతింపసాగిరి. స్నిగ్ధమై కళకళలాడు నా కుమారుని మోము జక్రవర్తి కడుతడవు వీక్షించి యనురాగ మధికము కాగా నతని పేరడిగి కమలాకరుం డని తెలుసుకొని వివిధములగుఁ బతకముల బహుమానముగ నిచ్చెను. అత్తరి నా రాజపుత్రుఁడు లేచి వినయమొప్ప “ రాజచంద్రా ! ' నన్నింత ఘనముగ గొనియాడనేల? మీ దయకుఁ బాత్రుండ నగుదునేని యియ్యఁదగిన మీ వ్రేలియుంగరము

164