ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము


మిక్కిలి నన్నే యెత్తిపొడిచెదవా? చక్రవర్తిపై లేనిపోనివి కల్పించిజెప్పి యుద్ధమునకు బురికొల్పి సేననంతయు ధ్వంసము కావించితివి. ఆ రణమున నీ వెక్కడ జచ్చితి " వన భట్టుగా రుగ్రుడై “అయ్యా ! ఈ లేనిపోని కంఠశోష తమకేటికి, మే మిరువురము దగవులాడుకొని మా వాదము దీర్పుడని మిము వేడుకొంటిమా ? జరుగవలసిన రాచకార్యముల గుఱించి మేమేమో మాటలాడుకొనుచుండ నడుమ మీ రేటికి సంబంధము గలుగజేసికొనెదరు. చాలు నీ పాటికి దమరూరకుండుడు." అన మితిమీరి వచ్చుచున్న యాగ్రహము నాపుకొని " జయచంద్రా! బాగుపడ దలచుకొంటివేని నే నింతకు ముందు చెప్పినట్లఁ జేయుము. లేకున్న నీ యిష్ట ” మని వినయశీలుఁడు వెడలి పోయెను. అతడు వెడలిపోవుట తడవుగ భట్టు మఱికొన్ని యిచ్చకములు వల్కి రాజును బయటకు గొనివచ్చెను. జయచంద్రుడు సభకేతెంచి హతశేషుల మన్నుపడిపోయిన చోట్ల దుర్గమును బాగుపఱుప నాజ్ఞాపించి మఱియు నితర సమాచారములఁ గూర్చి ముచ్చటించుకొనుచుండ పరిచారిక లేతెంచి సంయుక్త యెక్కడను గానరాలేదని వచించిరి. అగ్గలమగు నీర్ష్యాగ్రస్తుడై యహరహమును జక్రవర్తి నాశనముగావింపఁ దత్పరుఁడై యున్న యాతని మనస్సుకుఁ బ్రియకుమారిక పోయినదని వచించినను నావంతయుఁ జింతగలుగదయ్యె. కానరాలేదని వచించినతోడనే యుగ్రుడై "పోనిండు. గతించిన దని యూరకుండెను. దాని చింతయేల? మీరుపొం" డని

163