ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


“చక్రవర్తి నెదురింపదగిన నేనను సుల్తాన్ వద్దనుండి తెప్పించుకొని యా చుట్టుప్రక్కల నాశనముకాగా మిగిలిన గ్రామముల వెండియుఁ గొల్లగొట్టించుమని చెప్పిపంపెద" నని మరియు నిట్లు వక్కాణింపసాగేను. “రాజా! నీ వెంతమాత్ర మధైర్యపడకుము. బయటికేతెంచి యధాప్రకారముగ నీ రాచకార్యముల జక్కబెట్టుకొనుము. హతశేషులగు సైనికులు నీ కొఱకై యంతటను వెదకుచున్నారు. వారినందఱు నూరడిల్లఁ బలికి నీ బుత్రుడగు పరిహరరాజకులునకు వర్తమాన మంపుము . అతఁడు తత్క్షణ మతనిసేన నంతయు దీసుకొని నీకు సహాయపడఁ జనుదెంచును, ఇంకను నీకు మిత్రులై యున్న యితర రాజులఁ బిల్వనంపుము. వారును సేనాసహితులై నీకుఁదోడ్పడ జనుదెంతురు. నేనింతలో సుల్తానుగారినికూడ బిలుపించుకొని చక్రవర్తి నేదురింపుమని కుతుబుద్దీనుకు వ్రాసిపంపెదను. ఒకవేళ సుల్తాను కపజయము గలిగినచో మనము ప్రోగుజేసిన రాజుల నందరి వెంటఁగొని వారికి సహాయులమై పోవుదము. అప్పటికి మనకే పరాజయము గలిగిన తర్వాత జూచుకొందము. అవివేకులగు నీ ముదుసలివారల మాటల లెక్కగొనకు " మని భట్టు పల్కినంతనే యింతవరకును బైకి పొంగివచ్చుచున్న కోపము నంతయు నణచుకొని యూరక కూరుచుండియున్న వినయశీలుడు రోషపూరితుడై చివాలునలేచి " మూడుడా! జయచంద్రు నింతటితోనైన బాగుపడనీయ దలచుకొనలేదా? మీ మూలముననే గదా యితని కీగతిపట్టినది. దుర్మార్గుడా, మీదు

162