ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము


దను. గ్రామములం దల్లరులు సాగించినచో నట్టివారి దండించుటకై వచ్చి వారిచేతులలో జిక్కును, చక్రవర్తి దుర్గముననుండ జయించుట మనతరముకాదు. కావున నీవు దుఃఖముమాని బయటి కేతెమ్ము " అని కుతుబుద్దీనుకు దనకు జరిగిన విషయములు దెలిపి కొన్ని లేఖల గనుపఱుప జయచంద్రుఁ డించుక కలకఁదేరి మాటలాడ నారంభించెను. అసూయాపరుడగు మూఢుడు తనకెంత నష్టము గలుగుచున్నను దనవైరి నాశనసూచకములగు బలుకులు పల్కినంతనే మరల దుర్మార్గములు సేయుటకే కడఁగుఁగాని బుద్ధిగలిగి యూరకుండుననుట కల్ల. చక్రవర్తి జయమువలన బట్టరాని యీర్ష్యాశోకములకు దావలుడై రహస్య మందిరము శరణుజొచ్చిన జయచంద్రున కీశ్వరభట్టుగారి కుత్సితంపు వాక్యంబు లమృతోపమానము లయ్యెను. పురమంతయు నల్లకల్లోలమగునట్లు రణము జరుగుచున్నంతకాలము నిటు మొగమైన జూపక పారిపోయి యెక్కడనో తలదాచుకొని వచ్చిన పిరికిపందలలో నగ్రగణ్యుడగు నీ భట్టుగారి నీతివాక్యములచే రాజన్యాయముగ మోసపోవుచు వచ్చెను. భట్టుగా రెంతకైన మాటకారియే కాని క్రియాశూన్యుడు. సమయము వచ్చిన దన్న నంతఃపురదాసీల కాళ్ళనైన బట్టుకొనును. కాని జయచంద్రునిదగ్గర మాత్రము ధీరత్వముతోప గోటలు దాటునట్లు వచించుచుండును. భట్టుగారు వచించినమీద నా రాజు మరల "అయితే మీరిప్పుడేమిచేయ నెంచియున్నా" రని యడిగెను. అందుమీద నతడు తీరుగ దారిలోనికి వచ్చుచున్నాడని తలంచి

161