ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము


యగ్గలమగు నోర్వలేమి నతఁడు వినయశీలుని వలలోఁజిక్కి తన్ను పాటింపఁడను భయంబున మెల్లమెల్లనఁ జేరబోయి నమస్కరింప నతడు గూరుచుండుమని మఱేమియు మాటలాడక తలవంచుకొని యూరకుండెను. అత్తరి భట్టు రాజమనసు నిశ్చయముగ దిరిగిపోయినదని తలఁచి యెటులైన మరల దన మార్గమునకు ద్రిప్పుకొననెంచి యిట్లు వచింపసాగెను.

“రాజా! ఇట్టి సమయమున మీరిట్లు విచారపడుచుఁ గూరుచున్న గార్యమేమైన గలదా! ఎటువంటివారికైన గానిమ్ము; ఒకానొకవేళ గష్టములు రాకమానవు. కష్టములు కలిగినతరి దుఃఖింపుచు సౌఖ్యములు కలిగినతరి నిఁకఁదమయంతవారు లేరని పొంగిపడుట సజ్జనుల లక్షణముగాదు. నీ కిత్తరి నపజయము కలిగినదని నిరుత్సాహుడవు కాకుము. రణమందు జయాపజయంబు లొకరి స్వాధీనములు కావు. ఇప్పు డోడిన వాడు రేపు గెలుచును. రేపు గెలిచినవాడు మరల మరునాఁ డోడును. క్షత్రియులగు వారికి జయాపజయంబులు కాక వేరే మున్నవి? కాని యుత్తమ క్షత్రియుం డగువాఁ డపజయము కలిగినప్పుడే యెక్కువ ధైర్యము నవలంబించి యుండ వలయును. ఈ యింతమాత్రమునకే జడుపునొంది నీ విట్లూరక కూరుచుండి యుండుట యుక్తముకాదు. ఇత్తరి మనకుగలిగిన పరాభవమునకు వెఱచి చక్రవర్తి నింతటితో వదలెదనని తలఁచెదవేమో ! కలయందైన నట్లు తలంపకుము. చక్రవర్తి నాశనము జూచిగాని నే ప్రాణముల వదలనని నిక్కముగ నమ్మి

159