ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదిమూడవ ప్రకరణము


న్యాకుబ్జ నగరమున రణము జరుగుచున్నంతకాల మీశ్వరభట్టుగా రా పురమునకుఁ బదిమైళ్ళ దూరమున నొక చిన్న యడవిలోనుండి సేవకులవలన నేనాఁటివార్త లానాఁడు తెలుసుకొనుచు దుదకు జక్రవర్తి జయమంది దుర్గము నాశనము గావించిపోయినాఁ డన్నవార్తవిని యటనుండి బయలువెడలి పట్టణములోని కేతెంచి చూడ గోట యెక్కడిదక్కడ శిథిలమై యుండెను. హతశేషులగు సైనికు లతనిగాంచి యావురుమని యేడువసాగిరి. వారినందఱ నోదార్చి జయచంద్రుఁ డెక్కడనని యడుగుడు బ్రతివాడును దనకుఁ దెలియదని వచించెను. అంత వారినందఱిఁ గొలువుకూటంబున నుండ నాజ్ఞాపించి తా నొంటరిగ నవరోథ సౌధములకేగి యందు రహస్యమందిరముఁ బ్రవేశించి వినయశీలునితో సంభాషించుచున్న జయచంద్రుని గాంచి

158