ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము


కొందఱు భటులనంప వారు పోయివచ్చి యంతఃపురము పాడుపడియున్న దనియు, సంయుక్త యెక్కడఁ గానరాలేదనియు వచించిరి. తన ప్రియకాంత గానరాలేదని వచింప నత్యంత విచారమగ్నుఁడై పృధివీరా జేమిచేయుటకుఁ దోచక యుండ బైరాగివచ్చెను. చక్రవర్తి యతనిఁ గాంచిన వెంటనే సంతోషమును బొంది యుచితసత్కారంబు లొనర్చి సంయుక్తను గురించి యడుగ "రాజా ! ఆమె యిప్పుడీ నగరంబున లేదు. నీవు విచారించకుము. ఆమె కేవిధమైన భయమునులేదు. ఇత్తరి నీవు నీ రాజధానికేగుము. ఆమె నచటనే పెండ్లియాడగల" వని నోదార్చి బైరాగి వెడలిపోయెను. అనంతరము చక్రవర్తి సేనా సమేతుఁడై తన్నుఁగాపొడిన రాకొమారుని వెంటఁగొని నిజరాజధానికిఁ బయనమైపోయెను.

157