ఈ పుట ఆమోదించబడ్డది

రాణీసంయుక్త


డగు సేనాధిపతి కిట్టిపాటుకల్గు టవలోకించి సైనికులు ధైర్యము వీడసాగిరి. కాని యింతలో నీవార్తదెలిసి పృధ్వీరాజు పరువెత్తు కొనివచ్చి మరలఁ బురికొల్పఁ గడగెను. చక్రవర్తి వచ్చినాడని విని కహరకంఠీరవుఁ డతనిపై కురి'కెను. అత్తరి సైనికులందరు దమరాజును గాపాడు కొనుటకై తెగించి కహరకంఠీరవునిమీద బడిరి. కాని యాకలింగొన్న శార్దూలముభంగి వారి నందఱ నురుమాడుచు గహరకంటీరపుఁడు చక్రవర్తిని సమీపించి యతనితల దెగవేయ గత్తినెత్తెను. ఆసమయమున యౌవన వంతుడగు రాకుమారుఁ డొక డుత్తమాశ్వముపై వచ్చి చక్రవర్తిం జంపనెత్తియున్న హస్తముం దెగటార్చి తోడనే వానీ శిరముంగూల్చి భీతినందియున్న పృధివీరాజు సేనను మరల బురికొల్పెను. కహరకంఠీరవుని మరణమువలన జయచంద్రునిసేన పరుగిడజొచ్చెను. క్రొత్తగ నేతెంచిన రాజపుత్రుని యొక్కయు జక్రవర్తియొక్కయు నుత్సాహంపువచనములచే సార్వభౌమ సేన మరలనుప్పొంగి యుద్ధము సేయఁగడగెను. ఈతరుణ మందే చక్రవర్తికొనిరానంపిన క్రొత్తసేన ఢిల్లీనుండివచ్చి వీరలకు దోడ్పడి రణమొనరింప సాగెను. అనంతరము రెండుదినములకు జయచంద్రునివాహిని పూర్తిగ నాశనమయ్యెను. లెక్కలేని బందూకులు, బాణములు మఱియు రణమునకు వలసిన యితర శాస్త్రాస్త్రములన్నియు జక్రవర్తి పాలయ్యెను. జయచంద్రుని కొఱకు వెతకగా నతడెచ్చోటను గాన్పింపడయ్యెను. ఇట్లు సంపూర్ణజయము గాంచి చక్రవర్తి సంయుక్తను దోడితెమ్మని

156