ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము


శత్రువులు నిప్పులు కురిపించుచున్నను దాళుకొనుచు గోడల మీదకెక్కి యచటివారి గొందఱి గ్రిందికిఁదోయ నందఱనుదిగిరి ఆత్తరి పోరుమహా ఘోరమయ్యెను. బందూకనక, కత్తియనక బాణములనక, లాఠీలనక యిష్టమువచ్చిన యాయుధములతో నందఱు బోరాడగడఁగిరి. చక్రవర్తిసేన లోపలికేగి యుద్దమారంభింప జయచంద్రుని వాహిని నాశనముకాసాగి తుదకు మూఁడు వంతులు పూర్తిగా నాశనమయ్యెను. మిగిలినవార లించుక ధైర్యముచెడి పనిచేయుచుండుటఁజూచి జయచంద్రుని యువసకలాక్షౌహిణీ పతియగు కహరకంఠీరవుఁ డనువాడు తన సైన్యమును మరల బురిగొల్పుచు దాను యుద్ధమునకు దిగెను. కోట ముట్టడివలనను లోపలి యుద్ధము వలనను. చక్రవర్తి సేన యందును మూడు వంతులకన్న నెక్కువయే నాశన మయ్యెను. ఎంతనాశనమైనను నాతతాయి మొదలగువారు పలుకు ప్రోత్సాహంపు వచనంబుల శత్రువులకు లొంగక రణమొనరించు చుండిరి. కహరకంఠీరవుఁ డొక్కుమ్మడి సె రేగి చక్రవర్తి సేనయందు నడ్డమువచ్చిన వారినెల్ల నరకుచు నాతతాయిని సమీ పించెను. ఆత్తరి వారిరువురకు ఘోరమగు ద్వంద్వ యుద్ధముజరిగెను కొంతవడికి బందూకు గుండొకటివచ్చి యాతతాయి యెక్కి యున్న గుర్రపుఁగాలికి దగుల నదియా క్షణమందే నేలకొరగెను. ఆ తతాయి వెంటనే నేలకురికి శత్రుప్రహారముల దప్పించు కొనుచు మరల నొకగుర్రము నారోహింప బోవుసమయమున కహరకంఠీరవు డతనిశిరమును నేలగూల్చెను. అతి ప్రతాపవంతు

155